News December 12, 2024
ఆ విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు: ధర్మాన

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్, TDP, బీజేపీ ఏకమైనా గత ఎన్నికల్లో మాకు(YCP) 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి ఇచ్చిన హామీలు నమ్మి పేదలు అత్యాశకు పోయి తప్పు చేశారు. మేము కార్యకర్తలను విస్మరించిన మాట కొంత వరకు నిజమే. ఇదే విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ ముందుకెళ్తాం’ అని నిన్న టెక్కలిలో జరిగిన వైసీపీ ఆఫీస్ ప్రారంభ వేడుకల్లో వ్యాఖ్యానించారు.
Similar News
News January 1, 2026
2026ను స్వాగతించి..శుభాకాంక్షలు చెప్పిన ఇసుక కళాఖండం

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.
News December 31, 2025
శ్రీకాకుళం: ఈ రైడ్ సేఫేనా?

చోదకులు హెల్మెట్ ధరించక యాక్సిడెంట్‌ల్లో ప్రాణాలొదిలిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో తరచూ జరగుతుంటాయి. హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు అవగాహన కల్పించినా..పెడచెవిన పెట్టి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు హెల్మెట్ ఉన్నా..బైకులు పక్కన పెట్టి డ్రైవింగ్ చేయడం శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ కనిపించింది. పోలీసులు, ఫైన్‌ల నుంచి తప్పించుకోవడానికి తప్ప, వ్యక్తిగత భద్రతకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
News December 31, 2025
9 మందికి రూ.18 లక్షల పింఛన్లు అందజేసిన మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం హయాంలో ఆగిన 9 మందికి రూ.18 లక్షల పింఛన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలో అందించారు. నందిగామ మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన వీరికి మధ్యలో ఆగిపోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం మంజూరైన పెన్షన్లను అందజేశారు. RDO కృష్ణమూర్తి, మాజీ పీఎసీఎస్ ఛైర్మన్ వరప్రసాద్, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ ఉన్నారు.


