News December 12, 2024
నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు
AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Similar News
News December 12, 2024
వారికీ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News December 12, 2024
అదానీకి రూ.27వేల కోట్ల లాభం.. షేర్ల జోరు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుమీదున్నాయి. ఇవాళ ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.27వేల కోట్ల మేర పెరిగింది. రాజస్థాన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 250MW సోలార్ పవర్ ప్రాజెక్టును ఆరంభించింది. కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 11,434MWకు పెరగడంతో ఈ షేర్లు 7.1% లాభపడి రూ.1229 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ 5.6, ఎనర్జీ సొల్యూషన్స్ 3, టోటల్ గ్యాస్ 2.3, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.7, NDTV 1.7% మేర ఎగిశాయి.
News December 12, 2024
BREAKING: భీకర ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ ఏడుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు.