News December 12, 2024
HYDలో 84,000 ఇందిరమ్మ ఇళ్లు!

HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYDలో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్లో 84,000 ఇళ్లు నిర్మించాలి.
Similar News
News July 7, 2025
HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.
News July 7, 2025
HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.
News July 7, 2025
HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.