News December 12, 2024
తిరుపతి జిల్లాలోనూ సెలవు

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News January 23, 2026
రాష్ట్రంలోనే తొలిసారి నగరిలో..!

నెట్ జీరో క్యాంపస్ కాన్సెప్ట్‌ను ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో తొలిసారి నగరి బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో అమలు చేయనున్నారు. ఇక్కడ ఎల్ఈడీ బల్బులు, 12 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్టు తయారీ చేస్తారు. వర్షపు నీటిని నిల్వ చేసి.. నీటి వృథాను తగ్గిస్తారు. పచ్చదనం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
News January 23, 2026
చిత్తూరు: రేపే చివరి అవకాశం

దళిత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అజయ్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చిత్తూరు DRDA పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన ఎస్సీ మహిళలు శనివారం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులను మండల మహిళా సమాఖ్యలో సమర్పించాలన్నారు. ఈ పథకంలో జిల్లాకు 205 యూనిట్లు కేటాయించారన్నారు.


