News December 12, 2024

ప.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన

image

సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.

Similar News

News January 10, 2026

ప.గో: రైల్వేస్టేషన్‌కు దారి అడిగి.. మెడలో గొలుసు లాగారు!

image

నరసాపురం రోడ్డులో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. థామస్ బ్రిడ్జి సమీపంలో ఓ వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రైల్వేస్టేషన్ దారి అడిగారు. ఆమె వివరిస్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం వారి చేతికి చిక్కింది. దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు.

News January 9, 2026

ప.గో: మద్యం తాగి దొరికితే రూ.10 వేల జరిమానా!

image

నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ.10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు.

News January 9, 2026

పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

image

రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.