News December 12, 2024
లవర్స్ మిస్సింగ్!
TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యమైతే అందులో సుమారు 60వేల మంది ప్రేమికులే ఉన్నట్లు క్రైం రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 17-28 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. 85% మందిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని పేరెంట్స్‌కు అప్పగిస్తున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే వీరు గడప దాటుతున్నట్లు పోలీసుల కౌన్సెలింగ్‌లో తేలింది. మరోవైపు మిగతా 15% మంది ఆచూకీ మిస్టరీగా మారుతోంది.
Similar News
News December 12, 2024
జమిలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.
News December 12, 2024
పోలీసు కస్టడీకి వర్రా రవీందర్
AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ అరెస్టయ్యారు.