News December 12, 2024
భారత్‌ను ముక్కలు చేయాలనుకుంటున్న విదేశీ శక్తులు: ధన్‌ఖడ్
దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని విదేశీ శక్తులు భారత్‌ను ముక్కలు చేయాలనుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఐకమత్యంతో యాంటీ ఇండియా నెరేటివ్‌ను న్యూట్రలైజ్ చేయాలన్నారు. ‘భారత్ శక్తిసామర్థ్యాలున్న దేశమని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం వేగంగా ఎదుగుతున్నాం. దీనినెవ్వరూ అడ్డుకోలేరు’ అని చెప్పారు.
Similar News
News December 12, 2024
జమిలి ఎన్నికలు.. ఎప్పుడు జరిగాయంటే?
దేశంలో 1952లో తొలి సాధారణ(జమిలి) ఎన్నికలు జరగగా 1967 వరకు కొనసాగాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం, ముందుగానే అసెంబ్లీలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడంతో గడువులు మారాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News December 12, 2024
ఏపీని నం.1గా నిలబెడతాం: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో రాష్ట్రాన్ని నం.1గా నిలబెడతామని CM చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. మెగా DSC, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, పలు కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. దీపం-2 పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్?
News December 12, 2024
ఎల్లుండి ‘డాకు మహారాజ్’ నుంచి తొలి పాట
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఈనెల 14న మొదటి పాట విడుదల కానుంది. రేపు ఉ.10.08 గంటలకు ప్రోమోను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. 2025 జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.