News December 12, 2024
ప్రభుత్వ దుబారా ఖర్చుల వల్లే ద్రవ్యోల్బణం: మస్క్
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రభుత్వాలు చేసే అధిక వ్యయమే ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ దుబారా ఖర్చులను అరికడితే ద్రవ్యోల్బణం ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలనే చూస్తున్నామని, ధరల పెరుగుదలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 12, 2024
షేర్‌మార్కెట్: ఆ తప్పు ఖరీదు 4 నిండు ప్రాణాలు (1)
‘షేర్లు పడ్డప్పుడు కొని పెరిగినప్పుడు అమ్మేయాలి’.. ఈ నానుడి నిజమే అయినా అవగాహన లేకుండా కొంటే తిప్పలు తప్పవు. మార్కెట్లు పడ్డాయి కదాని అప్పుచేసి పెట్టుబడి పెడితే ఆ ఊబిలోంచి బయటపడలేరు. TG, తాండూరులో ఓ ల్యాబులో పనిచేసే శివప్రసాద్ ఇదే తప్పు చేశారు. అప్పుచేసి పెట్టుబడి పెడితే రాబడి రాలేదు. దాంతో అప్పుల బాధ తాళలేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. షేర్లు కొనేముందు రకరకాల అంశాలు ఇమిడి ఉంటాయి. అవేంటంటే..
News December 12, 2024
షేర్‌మార్కెట్: ఆ తప్పు ఖరీదు 4 నిండు ప్రాణాలు (2)
షేర్లలో అప్పుచేసి ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. డబ్బు లేకుంటే నెలకు కొంత పక్కన పెట్టుకొని కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు నిపుణుల వద్ద ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ నేర్చుకోవాలి. లాభనష్టాలు, నష్టభయంపై అవగాహన తెచ్చుకోవాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్, సపోర్టు, రెసిస్టెన్సీ, కన్సాలిడేషన్, కరెక్షన్, అక్యూములేషన్, మార్కెట్ కండీషన్స్ తెలుసుకొని చిన్నగా ఆరంభించాలి. అనుభవం వచ్చాక పొజిషన్ సైజ్ పెంచుకోవచ్చు.
News December 12, 2024
రోహిత్ శర్మ టెస్టులకు పనికిరాడు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్‌లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్‌గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్‌నెస్‌తో పోలిస్తే హిట్‌మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.