News December 12, 2024

HYDలో వైజాగ్ యువతి‌తో సహజీవనం.. మోసం!

image

యువతితో సహజీవనం పేరిట CAB డ్రైవర్‌ రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఈ ఘటన మధురానగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్‌డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. అతడి కోసం మతం మారినా మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది.

Similar News

News December 27, 2024

HYD: చిరుజల్లులు కానీ.. అంతకుమించి

image

HYD,RR,MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి అనేకచోట్ల చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాయత్రినగర్‌లో-21 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. HYD షేక్‌పేట-7, ఓయూలో-6, హిమాయత్‌నగర్-5.8, ఫిలింనగర్-5, ఉప్పల్-4.8, ఆసిఫ్‌నగర్-4.8, అంబర్‌పేట-4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేటి నుంచి వర్షం పడకపోవచ్చని తెలిపింది.

News December 27, 2024

మహిళల రక్షణకు చట్టాల్లో మార్పులు వచ్చాయి: CI

image

ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలుకెళ్లడం ఖాయమని HYDలోని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్‌లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.

News December 26, 2024

రేపు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సమావేశం

image

బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో రేపు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు, 40కి పైగా బీసీ సంఘాలు పాల్గొననున్నారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.