News December 12, 2024

సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News December 12, 2024

ఈనెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: మంత్రి

image

AP: ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని పేర్కొన్నారు.

News December 12, 2024

‘పుష్ప-2’లో నా ఫేవరెట్ సీన్ అదే: అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ సినిమాలో ‘తగ్గేదేలే’ అని చెప్పే ప్రతి సీన్‌ తన ఫేవరెటేనని హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన భారతీయులకు ఐకాన్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప అంటే ఫైర్ కాదని, వెల్డ్ ఫైర్ అని హిందీలో డైలాగ్ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌దేనని పేర్కొన్నారు.

News December 12, 2024

జమిలి ఎన్నికలు.. ఎప్పుడు జరిగాయంటే?

image

దేశంలో 1952లో తొలి సాధారణ(జమిలి) ఎన్నికలు జరగగా 1967 వరకు కొనసాగాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం, ముందుగానే అసెంబ్లీలు రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడంతో గడువులు మారాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.