News December 12, 2024

HYD: ఆన్‌లైన్‌ గేమింగ్.. బీ కేర్‌ ఫుల్!

image

ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమాదకరమని‌ HYD సైబర్ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్‌ చేశారు.
‘ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.

SHARE IT

Similar News

News October 28, 2025

HYD: రూ.168 కోట్లతో హైడ్రాలాజికల్ సెంటర్

image

HYDలో దాదాపు రూ.168 కోట్లతో నేషనల్ హైడ్రాలాజికల్ ప్రాజెక్టు కింద స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డ్స్ ఏర్పాటు, జలాశయాల్లో పూడికతీత, సర్వేల నిర్వహణ, ప్రాజెక్టుల వద్ద సిస్టం ఏర్పాటు యంత్ర సమీకరణ తదితర వాటిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి మొత్తం కేంద్రమే నిధులు అందించనుంది.

News October 28, 2025

HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

image

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT

News October 28, 2025

HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

image

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్‌గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.