News December 12, 2024

నేను ప్రెగ్నెంట్ కాదు: సోనాక్షి సిన్హా

image

తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను ఇంకా గర్భం దాల్చలేదని తెలిపారు. బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె మండిపడ్డారు. తమకు పెళ్లై నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. కాగా గత జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 12, 2024

గుకేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

ప్రపంచ చెస్ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.

News December 12, 2024

గుడ్ న్యూస్.. పోస్టుల సంఖ్య పెంచిన SSC!

image

CHSL-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ SSC కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది. అంతకుముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టైర్-2 పరీక్ష పూర్తయింది. తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనుంది.

News December 12, 2024

భారీ వర్షాలు.. కీలక ఆదేశాలు

image

APలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ‘వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఫోన్ కాల్స్, SMSలతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలి’ అని ఆమె ఆదేశించారు.