News December 12, 2024

అరెస్టు చేయడం దుర్మార్గం: కేటీఆర్

image

గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని సిరిసిల్ల MLA KTR ట్వీట్ చేశారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదన్నారు.

Similar News

News January 17, 2026

WGL: పరిశ్రమలతో 6,810 మందికి ఉపాధి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇప్పటికి 48 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.380.53 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,810 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

News January 13, 2026

వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.