News December 12, 2024
ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్

TG: జల్పల్లి ఘర్షణలో అస్వస్థతకు గురైన సినీ నటుడు మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, మెడికల్ రిపోర్టులు అన్ని నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిన్న ఆయన పోలీసు విచారణకు హాజరు కాకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 5, 2025
భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్‌కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.
News November 5, 2025
నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.
News November 5, 2025
త్వరలో పెన్షన్లపై తనిఖీలు

TG: రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు చేసేందుకు సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్ఛార్జులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.


