News December 12, 2024

90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన వృద్ధురాలు

image

డిగ్రీ పూర్తి చేయాలనే సంకల్పం ముందు వృద్ధాప్యం చిన్నబోయింది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 90ఏళ్ల రాబర్జ్ న్యూ హాంప్‌షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఏదైనా ప్రారంభిస్తే దానిని పూర్తిచేసే వరకూ నిద్రపోనని ఆమె చెప్తున్నారు. ఆమె ఇదివరకు సమీపంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతో పాటు బీమా ఏజెంట్‌గా పనిచేసేవారు. ఆమెకు ఐదుగురు పిల్లలుండగా 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు.

Similar News

News December 12, 2024

అర్ధ సంవత్సర పాలన అర్థ రహితం: షర్మిల

image

AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News December 12, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/PET పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

News December 12, 2024

రికార్డులన్నాక బ్రేక్ అవ్వాల్సిందే: అల్లు అర్జున్

image

రికార్డులనేవి తాత్కాలికమేనని, వాటికన్నా తనకు అభిమానుల ప్రేమే ముఖ్యమని హీరో అల్లు అర్జున్ అన్నారు. రికార్డులన్నాక బ్రేక్ అవ్వాల్సిందేనని తాను చెప్తానని, ఇంకో 2-3 నెలల్లో కొత్తవి నమోదు కావచ్చని చెప్పారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అనేది ముఖ్యం కాదని దేశం ఎదుగుతోందని పేర్కొన్నారు. ‘పుష్ప-2’ విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.