News December 12, 2024

ADB: లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోర్టులలో ఏళ్ల పాటుగా పరిష్కరించబడని కేసులు రాజీ పడటంతో తక్షణం పరిష్కరించబడి సమయం, డబ్బులు, వృధా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయాన్ని పొంది ఉపశమనం పొందవచ్చు అని అన్నారు.

Similar News

News November 9, 2025

రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్‌కు ADB జట్టు

image

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.

News November 9, 2025

ఆదిలాబాద్: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్‌లోని ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94921 36510 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News November 9, 2025

ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్‌లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్‌లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.