News December 12, 2024

100 రోజుల యాక్షన్ ప్లాన్: లోకేశ్

image

ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.

Similar News

News January 14, 2026

గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

image

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.

News January 14, 2026

ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

image

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.

News January 14, 2026

వెంటనే ఇరాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ సూచన

image

ఇరాన్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలని, ఎంబసీతో కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపింది. సాయం కోసం ఫోన్ నంబర్లను, మెయిల్‌(cons.tehran@mea.gov.in )లో సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్టర్ కాని వారు అధికారిక <>సైట్‌లో<<>> రిజిస్టర్ కావాలని సూచించింది.