News December 12, 2024
ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.
Similar News
News December 13, 2024
నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
HYDలో నూతన సంవత్సర వేడుకలకు క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, 3 స్టార్ ఆపై హోటల్స్ నిర్వాహకులకు CP ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31/JAN 1న రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించే వేడుకలకు అనుమతి తప్పనిసరని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రా.10గంటల వరకే DJ అనుమతిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తప్పనిసరి అన్నారు.
News December 13, 2024
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 12, 2024
రైతుకు బేడీలు.. విచారణలో ఏం తేలిందంటే?
TG: రైతుకు <<14858119>>బేడీలు వేసిన ఘటన<<>> వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. దీనికి సంగారెడ్డి జైలు సిబ్బంది తప్పిదమే కారణమని తేల్చారు. జైలు అధికారులు VKB పోలీసులకు బదులుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారని, హీర్యా నాయక్ లగచర్లలో అరెస్టయితే బాలానగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో ఉందని గుర్తించారు. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్‌ను సస్పెండ్ చేశారు.