News December 12, 2024
రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. స్పందించిన బన్నీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధార, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. అనధికార సమాచారాన్ని షేర్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. సరైన వివరాలకు టీమ్ ఇచ్చే అప్డేట్స్‌ను అనుసరించాలని సూచించింది.
Similar News
News December 12, 2024
రైతుకు బేడీలు.. విచారణలో ఏం తేలిందంటే?
TG: రైతుకు <<14858119>>బేడీలు వేసిన ఘటన<<>> వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. దీనికి సంగారెడ్డి జైలు సిబ్బంది తప్పిదమే కారణమని తేల్చారు. జైలు అధికారులు VKB పోలీసులకు బదులుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారని, హీర్యా నాయక్ లగచర్లలో అరెస్టయితే బాలానగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో ఉందని గుర్తించారు. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్‌ను సస్పెండ్ చేశారు.
News December 12, 2024
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?
APలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
News December 12, 2024
ఢిల్లీ: అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 21 మందికి చోటు కల్పించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉండగా ఈ స్థానంలో కేజ్రీవాల్ పోటీ చేసే అవకాశముంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.