News December 12, 2024
భారీ వర్షాలు.. కీలక ఆదేశాలు

APలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ‘వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలతో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు ఫోన్ కాల్స్, SMSలతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలి’ అని ఆమె ఆదేశించారు.
Similar News
News January 13, 2026
భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.
News January 13, 2026
ఐఫోన్ యూజర్లకు అలర్ట్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.


