News December 12, 2024
కీర్తి సురేశ్‌కు సమంత స్పెషల్ నోట్
చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.
Similar News
News December 13, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 13, 2024
డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు
1955: మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు
News December 13, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 13, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
అసర్: సాయంత్రం 4.08 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
ఇష: రాత్రి 7.01 గంటలకు
NOTE: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.