News December 12, 2024

మూడో టెస్టులో ఓపెనర్‌గా రోహిత్?

image

AUSతో జరిగే మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆయన దారుణంగా విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెట్స్‌లో ఆయన కొత్త బంతులతోనే ప్రాక్టీస్ చేయడం గమనార్హం. రెండో టెస్టులో రాహుల్ ఓపెనర్‌గా రాగా హిట్ మ్యాన్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి రెండు ఇన్నింగ్సుల్లో 9 పరుగులే చేశారు. గత 12 ఇన్నింగ్సుల్లో ఆయన ఒకే అర్ధసెంచరీ చేశారు.

Similar News

News December 13, 2024

ప్రియుడితో పెళ్లి.. కీర్తి సురేశ్ ఎమోషనల్

image

తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అంథోనీని హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంథోనీ తాళి కట్టిన తర్వాత ఆమె ఎమోషనల్‌ అయ్యారు. ఈ ఫొటోను హీరో నాని పంచుకున్నారు. ఈ మ్యాజికల్ క్షణాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు ట్వీట్ చేశారు. కీర్తి, నాని కలిసి దసరా, నేను లోకల్ చిత్రాల్లో నటించారు.

News December 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 13, 2024

డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1955: మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు