News December 12, 2024

అర్ధ సంవత్సర పాలన అర్థ రహితం: షర్మిల

image

AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

News February 1, 2026

రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

image

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.