News December 12, 2024

జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని రూపొందించాలి: TSJU

image

జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరుతూ TSJU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చిన్న పత్రికల ఎంప్యానల్ మెంట్ చేయాలని, జర్నలిస్ట్ పెన్షన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వారు కోరారు. అలాగే రూ.10 లక్షల ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

Similar News

News July 9, 2025

మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

image

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ ఇచ్చి గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.

News July 9, 2025

నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

image

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు

News July 9, 2025

HYD: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే సామాజిక సేవ

image

ఫూటుగా మద్యం తాగి బండ్లు నడుపుతూ పట్టుబడిన వారు సామాజిక సేవచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌లో చిక్కిన ముగ్గురికి మేడ్చల్ అత్వెల్లి కోర్టులో 2రోజులు, సుచిత్ర కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్, అవేర్నెస్, రోడ్లు మరమ్మతులులో పాల్గొనాలని ఆదేశించిందని తెలిపారు. శిక్ష అమలులో భాగంగా నిందితులు సుచిత్ర కూడలిలో పనులు చేశారు.