News December 13, 2024
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ సురేష్ శెట్కార్

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లిన సీఎం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, సింగరేణి బొగ్గు గనులు, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో సీఎం చర్చించారు. కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఉన్నారు.
Similar News
News January 21, 2026
తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.
News January 21, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటరు జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 21, 2026
NZB: ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లను కేటాయించండి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా 50 శాతం సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవన్నారు. జనరల్ స్థానాల్లో 50 శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


