News December 13, 2024

ప్రియుడితో పెళ్లి.. కీర్తి సురేశ్ ఎమోషనల్

image

తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అంథోనీని హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంథోనీ తాళి కట్టిన తర్వాత ఆమె ఎమోషనల్‌ అయ్యారు. ఈ ఫొటోను హీరో నాని పంచుకున్నారు. ఈ మ్యాజికల్ క్షణాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు ట్వీట్ చేశారు. కీర్తి, నాని కలిసి దసరా, నేను లోకల్ చిత్రాల్లో నటించారు.

Similar News

News January 17, 2026

స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

image

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.

News January 17, 2026

ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> ప్రాజెక్ట్ ఆఫీసర్, SAP స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.40వేలు, SAP స్పెషలిస్టుకు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 17, 2026

మెదడు ఇచ్చే ముందస్తు సంకేతం.. నెగ్లెక్ట్ చేయొద్దన్న వైద్యులు!

image

మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది భవిష్యత్తులో రాబోయే భారీ స్ట్రోక్‌కు ముందస్తు హెచ్చరిక లాంటిదని ప్రముఖ వైద్యుడు సుధీర్ కుమార్ హెచ్చరించారు. మాట తడబడటం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు నిమిషాల్లో తగ్గిపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవడం ద్వారా 80% వరకు మేజర్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చని సూచించారు.