News December 13, 2024

నేడు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు మంత్రి ఉత్తమ్ రాక

image

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్ కు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Similar News

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: టీపీసీసీ చీఫ్

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.

News December 26, 2024

NZB: జల్సాల కోసం బైకు దొంగతనాలు

image

నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

News December 26, 2024

రేవంత్ రెడ్డి స‌ర్కార్ మ‌హిళ‌ల‌ను న‌మ్మించి మోసం చేసింది: కవిత

image

రేవంత్ రెడ్డి స‌ర్కార్ మ‌హిళ‌ల‌ను న‌మ్మించి మోసం చేసింద‌ని నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెద‌క్ చ‌ర్చిని సంద‌ర్శించిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె విమర్శించారు.