News December 13, 2024
మంచిర్యాల: అండర్- 14 ఉమ్మడి బాలుర క్రికెట్ జట్టు ఎంపిక

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో మంచిర్యాలలో ఉమ్మడి జిల్లా అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. కోచ్ ప్రదీప్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జట్టును ప్రకటించారు. మంచిర్యాల నుంచి లక్ష్మణ్ సాయి, అర్జున్ రిషికేశ్ చందర్, జహీర్, సాత్విక్ ఎంపికయ్యారు. ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారిని పలువురు అభినందించారు.
Similar News
News November 8, 2025
ADB: శిక్షణ సివిల్ సర్వీస్ అధికారుల బృందానికి వీడ్కోలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కు చెందిన శిక్షణ అధికారులు (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్) బృందం జిల్లా పర్యటన ముగిసింది. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.
News November 8, 2025
పకడ్బందీగా సరిహద్దులు గుర్తించాలి: ADB కలెక్టర్

చిత్తడి నేలల సర్వే, సరిహద్దుల గుర్తింపుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా పకడ్బందీగా సరిహద్దులు గుర్తించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీ రావు పాటిల్ పాల్గొన్నారు.
News November 7, 2025
ఆదిలాబాద్: పార్శిల్ డెలివరీ అంటూ ఏం చేశారంటే..!

సైబర్ నేరగాళ్ల వలలో మరో వ్యక్తి మోసపోయాడు. పార్శిల్ డెలివరీలో ఇబ్బందులు ఉన్నాయంటూ వచ్చిన మెసేజ్ కారణంగా బాధితుడు రూ.46,408 పోగొట్టుకున్నాడు. వన్ టౌన్ CI సునీల్ వివరాల మేరకు.. శాంతినగర్ కు చెందిన బిలాల్ కు ఇండియా పోస్టు డెలివరీ యువర్ పార్సెల్ వాజ్ అన్సక్సెస్ఫుల్ డ్యూ టూ ఇన్కరెక్ట్ అడ్రస్ అనే సాధారణ మెసేజ్ వచ్చింది. వెబ్ సైట్ లో అతను అప్డేట్ చేయగా డబ్బులు పోగొట్టుకున్నాడు. శుక్రవారం ఫిర్యాదు చేశాడు.


