News December 13, 2024
ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగారన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని మంత్రి తుమ్మల హెచ్చరించారు. గతంలో ఎవరి ఒత్తిళ్ల వల్ల తప్పు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని మంత్రి సూచించారు.
Similar News
News December 27, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ లైన్స్
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్ల సమీక్ష ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
News December 27, 2024
ALERT.. KMM: డిగ్రీ విద్యార్థులకు గమనిక
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నేడు జరగబోయే మొదటి, ఐదో సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని అన్నారు.
News December 27, 2024
మంత్రి పొంగులేటి నేటి పర్యటన వాయిదా
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్‌ఛార్జి దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా మంత్రి పొంగులేటి అధికార పర్యటన వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.