News December 13, 2024

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

image

జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని కేటీఆర్ అన్నారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌నూ అరెస్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 29, 2025

RSS అల్‌ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

image

RSSను ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్‌ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.

News December 29, 2025

డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

image

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్‌గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.

News December 29, 2025

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్‌పై పాక్ నిషేధం

image

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్‌పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్‌లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.