News December 13, 2024

BigC 22వ వార్షికోత్సవ సంబరాలు

image

దక్షిణ భారతదేశంలో నెం1 మొబైల్ రిటైల్ సంస్థ Big C 22వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్బంగా Big C ఫౌండర్ & సీఎండీ ఎం.బాలుచౌదరి మాట్లాడుతూ.. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు, మొబైల్స్‌పై తక్షణ క్యాష్ బ్యాక్, యాక్సెసరీస్‌పై 51% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు. కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News November 11, 2025

HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

image

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.

News November 11, 2025

HYD: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

image

HYD ఫిలింనగర్‌ PSలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రోడ్ నంబర్ 7లో ఉంటున్న శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకి వెళ్లాడు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, ఆక్రమించేందుకు యత్నించాడని శివప్రసాద్ PSలో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News November 11, 2025

HYD: నిర్మాణంలో ఉన్న అందెశ్రీ ఇల్లు ఇదే..!

image

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ NFC నగర్‌లో కవి అందెశ్రీ నిర్మించుకుంటున్న ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. 348 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న G+3 భవనం నిర్మాణ దశలో ఉంది. ఇల్లు నిర్మించే స్థోమత లేక లాలాపేటలోని ఇరుకు ఇంట్లో ఉంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌ ఆర్థిక సహాయం చేయడంతో గృహ నిర్మాణం ప్రారంభమైంది. పనులను స్వయంగా పర్యవేక్షించేవారు. కలల సౌధం పూర్తికాకముందే అందెశ్రీ కాలం చేశారు.