News December 13, 2024

పకడ్బందీగా ‘పుష్పరాజ్’ రిమాండ్ రిపోర్ట్..!

image

చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటివరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయనను కూడా అరెస్టు చేశారు. కోర్టుకు సమర్పించే రిమాండ్ రిపోర్టును పకడ్బందీగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా తయారు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినందువల్లే పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Similar News

News January 13, 2026

HYD: నేడు ఆకాశంలో అద్భుతాలు..!

image

నేడు HYD దద్దరిల్లనుంది. ఆకాశంలో రోజంతా అద్భుతాలు చూడొచ్చు.
☛ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 3 డేస్ కైట్& స్వీట్ ఫెస్టివల్
☛ 3డేస్ పరేడ్ గ్రౌండ్లో సా.5 నుంచి రాత్రి వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్
☛ గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్
వీటికోసం రాష్ట్ర పర్యాటకశాఖ సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించింది.

News January 13, 2026

HYD: స్మోకింగ్ చేయకపోయినా క్యాన్సర్

image

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్, సర్విక్స్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు స్మోకింగ్ చేసేవారికే వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు తాగనివారి జీవితాలనూ కబళిస్తోంది. HYDలో మహిళల్లో, ముఖ్యంగా స్మోకింగ్ అలవాటులేనివారిలోనూ కేసులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, ఇరుకు కిచెన్‌లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, చెత్త దహనం, ధూళి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 13, 2026

HYD: హైడ్రా వారి జోలికి వెళ్లదు..!

image

నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని మరోసారి స్పష్టం చేసింది. 2024 జులైలో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. చట్టం ప్రకారం హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొంది. నిన్న హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు అందాయి.