News December 13, 2024

Allu Arjun Arrest: రాజకీయ రంగు?

image

అల్లు అర్జున్‌కు రాజ‌కీయ పార్టీల నుంచి అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. బ‌న్నీ అరెస్టును BRS, YCP, BJP నేతలు ఖండించారు. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ద‌క్కించుకొని తెలుగు ప్రజలకు గౌర‌వాన్ని తెచ్చిన బన్నీ అరెస్టు అన్యాయమని రాజాసింగ్ అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే తొక్కిస‌లాట జ‌రిగింద‌ంటూ పార్టీలు బ‌న్నీకి మ‌ద్ద‌తుగా నిల‌వడం ద్వారా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటున్నట్టు కనిపిస్తోంది.

Similar News

News January 10, 2026

కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు.. న్యాయం జరిగేనా?

image

AP: కేంద్ర <<18812112>>బడ్జెట్‌లో<<>> రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేసింది. అదనంగా రుణపరిమితి, ప్రత్యేక గ్రాంట్ల వెసులుబాటు కల్పించాలంటోంది. కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

News January 10, 2026

OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

image

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

News January 10, 2026

రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

image

<>AP <<>>హెల్త్ , మెడికల్& ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో 97అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగంలో పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/