News December 13, 2024
Stock Market: వీకెండ్‌లో బుల్స్ జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం మిడ్ సెషన్‌లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఉదయం వెయ్యికి పైగా పాయింట్ల నష్టంతో కదిలిన సెన్సెక్స్ చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 219 పాయింట్లు బలపడి 24,768 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, ఫైనాన్స్, బ్యాంకు, ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News January 14, 2026
కోడి పందేల హోరు: గెలిస్తే బుల్లెట్, కారు బహుమతి!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలు రసవత్తరంగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. 6 పందేలు వరుసగా గెలిచిన పుంజుల యజమానులకు బుల్లెట్ బైకులు, కొన్ని చోట్ల ఏకంగా లగ్జరీ కార్లను బహుమతులుగా అందజేస్తున్నారు. దీంతో బరుల వద్ద సందడి నెలకొంది. చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ రూ.కోట్లాది బెట్టింగ్‌లు, ఖరీదైన ఆఫర్లతో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి.
News January 14, 2026
మైక్రో చీటింగ్‌తో కాపురాల్లో చిచ్చు

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.
News January 14, 2026
పొంగల్.. టార్గెట్ ఎలక్షన్స్!

PM మోదీ ఈసారి తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ ఇంట పొంగల్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం రాజకీయ చర్చకు దారితీసింది. తన స్పీచ్‌లోనూ తమిళ పదాలు మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది TN అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ సన్నద్ధమవుతోంది. అధికారం చేజిక్కించుకుంటామని ఇప్పటికే కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో మోదీ తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది.


