News December 13, 2024

అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలులో ఉంటారు: నటుడు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. ‘దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేశారా? అలా చేస్తే సగం మంది రాజకీయనేతలు లోపల ఉండాలి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరలవుతోంది. అయితే, చట్ట ప్రకారం ఇదంతా జరుగుతుండటంతో సినీ ఇండస్ట్రీ సభ్యులు సైతం రియాక్ట్ అయ్యేందుకు ఆలోచిస్తున్నారు.

Similar News

News January 24, 2026

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

image

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ICC చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్‌లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.

News January 24, 2026

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

image

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.

News January 24, 2026

ESIC ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>ఢిల్లీ 45 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MCh/DM, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. ఫుల్ టైమ్ స్పెషలిస్టుకు 69 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/