News December 13, 2024

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

image

నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తనపై కేసులు కొట్టేయాలని బన్నీ క్వాష్ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కేసులన్నీ కొట్టేయలేమన్నారు. అయితే తాత్కాలిక ఊరటగా రూ.50 వేల పూచీకత్తుతో 4 వారాల ‘పరిమిత కాల బెయిల్ ఇస్తాం’ అని ఆదేశాలిచ్చారు. కాగా బన్నీని పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Similar News

News April 3, 2026

ఏ దేశ ప్రజలకు ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ ఉన్నారంటే?

image

అత్యధిక లైంగిక భాగస్వాములను కలిగిన దేశాల లిస్ట్‌లో తుర్కియే టాప్‌లో ఉంది. ఇక్కడి పౌరుల లైంగిక భాగస్వాముల సగటు 14.5గా ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ చెబుతోంది. తుర్కియే తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా (13.3), న్యూజిలాండ్ (13.2), ఐస్‌లాండ్ (13.0), సౌతాఫ్రికా (12.5) ఉన్నాయి. ఇక అతితక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ కలిగిన దేశంగా భారత్‌(3) నిలిచింది.

News April 3, 2026

అమ్మోరు/మశూచి వ్యాధిని కోళ్లలో ఇలా గుర్తించండి

image

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.

News April 3, 2026

‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

image

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.