News December 13, 2024
బౌలర్‌ని కాదు.. బంతినే చూస్తాం: గిల్
ఆస్ట్రేలియాపై ఆడేందుకు భయపడట్లేదని భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. ‘గెలవకపోవడం వల్ల భయపడుతున్నామంటే అర్థం ఉంది. మేం చివరిగా ఇక్కడ ఆడినప్పుడు గెలిచాం. భారత్‌లోనూ ఆస్ట్రేలియాను ఓడించాం. బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్నది మా జనరేషన్ పట్టించుకోదు. కేవలం బంతినే చూస్తుంది. ఓ టీమ్‌గా ఎలా పోరాడాలన్నదానిపైనే ప్రస్తుతం జట్టు దృష్టిపెట్టింది. మా దృష్టిలో ఇక ఇది 3 టెస్టుల సిరీస్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2024
GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!
గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.
News December 27, 2024
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.