News December 13, 2024
పోక్సో నేరస్థుడికి జీవిత ఖైదు: ఎస్పీ
దెందులూరుకు చెందిన ఆంథోనీ రాజ్ (51)కు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జ్ సునంద శుక్రవారం తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2022 అక్టోబరు 8 న గ్రామానికి చెందిన ఓ బాలికపై సదరు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు నేరం రుజు కావడంతో జీవిత ఖైదు తో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ జడ్జ్ తీర్పునిచ్చారన్నారు.
Similar News
News January 14, 2025
ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 14, 2025
ప.గో: మొదటిరోజు..100 కోట్లు పైనే..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం భోగి రోజు కోడిపందాలు జోరుగా సాగాయి. పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు పాల్గొని పెద్ద ఎత్తున పందాలు కాశారు. పందాల పేరిట కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి. మొదటిరోజు కోడిపందాలు, గుండాట, పేకాటల ద్వారా సుమారు రూ.100 కోట్ల రూపాయలు పైనే చేతులు మారినట్లుగా అంచనా.
News January 13, 2025
సంక్రాంతికి వస్తున్నారా..ఇవి మిస్ కావద్దు
పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుండి సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పండుగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చేవారు సంక్రాంతి మూడు రోజులు ఈ ప్లేస్‌లు మాత్రం మిస్ కావద్దు. భీమవరం మావుళ్ళమ్మ జాతర, భీమవరం, పాలకొల్లు, మొగల్తూరులో జరిగే సంక్రాంతి సంబరాలు, పేరుపాలెం బీచ్‌లో, నరసాపురం వణువులమ్మ జాతర.