News December 13, 2024

రాజ్యసభకు ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం

image

ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఉపఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌ రావు, సానా సతీశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో రాజ్యసభకు వీరి ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికైన అభ్యర్థులు శుక్రవారం ఆర్వో నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గవ్వల భరత్ తదితరులు సన్మానించారు.

Similar News

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.

News December 27, 2024

వారం రోజులు సంతాప దినాలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.

News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.