News December 13, 2024

రేపు సంక్షేమ హాస్టళ్లలో సీఎం తనిఖీలు

image

TG: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని అంచనా వేసేందుకు CM రేవంత్, మంత్రులు, అధికారులు రేపు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను సందర్శించనున్నారు. RR, VKB, HYD జిల్లాల్లో ఏదో ఒక సంక్షేమ హాస్టల్‌లో CM ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని పేర్కొన్నారు. కాగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది.

Similar News

News December 27, 2024

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

image

మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.

News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.

News December 27, 2024

బీసీ మహిళలు, యువతకు GOOD NEWS

image

AP: బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 80వేల మంది BC, EBC మహిళలకు 90 రోజులపాటు టైలరింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే డీ ఫార్మా, బీఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ₹8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో ₹4 లక్షలు సబ్సిడీ, ₹4 లక్షలు రుణంగా ఉంటుంది. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.