News December 13, 2024
CM చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది: పవన్

AP: CM చంద్రబాబును Dy.CM పవన్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆయన 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడిపించాలి. తన కుటుంబంతో పాటు 5 కోట్ల కుటుంబాలను చూసుకోవాలి. వారి అవసరాలను తీర్చాలి. శత్రువుల దాడులనూ తట్టుకోవాలి. అయినా కూడా ఉన్న 24 గంటలను ప్రజల కోసం ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారు. అందుకే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News January 10, 2026
కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు.. న్యాయం జరిగేనా?

AP: కేంద్ర <<18812112>>బడ్జెట్‌లో<<>> రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేసింది. అదనంగా రుణపరిమితి, ప్రత్యేక గ్రాంట్ల వెసులుబాటు కల్పించాలంటోంది. కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<


