News December 14, 2024
ఒంగోలు: ‘రహదారి భద్రత నిబంధనలు పాటించాలి’

ఒంగోలు ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆటో డ్రైవర్లు కాలేజీ బస్సుల యజమానులకు రహదారి భద్రతా నియమ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఉప రవాణా కమిషనర్ సుశీల మాట్లాడుతూ.. ఆటోలలో స్కూలు పిల్లలను తరలించవద్దని అధిక లోడుతో ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. సరియైన రికార్డులను కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని లేనట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News September 14, 2025
ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.
News September 14, 2025
SP దామోదర్‌కు వీడ్కోలు

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
News September 14, 2025
బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.