News December 14, 2024

ప్రేమవ్యవహారం.. కొలిమిగుండ్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీ హర్ష (20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రమేశ్ బాబు వివరాల మేరకు.. శ్రీ హర్ష గుజరాత్‌లోని వొడదొరలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. తన కొడుకు బలవన్మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని తండ్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వివరించారు.

Similar News

News January 5, 2026

కర్నూలు: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 84 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు స్వీకరించారు. మోసాలు, చీటింగ్, పంట దోపిడీ తదితర అంశాలపై పోలీసు అధికారులు తక్షణ స్పందించాలని ఆదేశించారు.

News January 5, 2026

రౌడీషీటర్లకు కర్నూలు జిల్లా పోలీసుల కౌన్సెలింగ్

image

జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. సత్ప్రవర్తనతో జీవించాలని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించిన పోలీసులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 4, 2026

కర్నూలులో కడుపుబ్బా నవ్వించిన జబర్దస్త్ టీమ్

image

కర్నూలులో జబర్దస్త్ టీమ్ కడుపుబ్బ నవ్వించారు. ఆదివారం టీజీవి కళాక్షేత్రంలో 2026 సంవత్సరం మొదటి ప్రదర్శనగా జబర్దస్త్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యావేత్తలు కేవీఎన్ రాజశేఖర్, పుల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం మొత్తం శ్రోతలకు ఆనందం, వినోదం అందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.