News December 14, 2024

స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు

image

వరుసగా రెండోరోజూ ఢిల్లీలోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. RK పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు ఉదయం 6:09 గంటలకు మెయిల్ రావడంతో యాజమాన్యం వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిసింది. ఇప్పటి వరకు 40 స్కూళ్లకు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News January 27, 2026

అరటిలో మెగ్నిషియం లోపం – నివారణ

image

అరటి మొక్కల్లో మెగ్నీషియం లోపం వల్ల పాత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి, ఆకులపై గోధుమ/ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకు ఈనె మధ్య పచ్చగా ఉండి, పక్కలు పసుపు రంగులోకి మారి, చివరికి ఆకులు ఎండి రాలిపోతాయి. ఆకులు, ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల నిలిచిపోతుంది. ఈ సమస్య నివారణకు లీటరు నీటికి మెగ్నిషియం సల్ఫేట్ 3గ్రా.లను కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

News January 27, 2026

IIITM గ్వాలియర్‌లో ఉద్యోగాలు

image

గ్వాలియర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్‌(<>IIITM<<>>) 22 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD ఉత్తీర్ణులు అర్హులు. నెలకు జీతం రూ.57,700-రూ.98,200 చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: www.iiitm.ac.in

News January 27, 2026

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉపసంహరణకు FEB 3 వరకు అవకాశం ఉంటుంది. FEB 11న పోలింగ్, 13న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని SEC రాణి కుముదిని తెలిపారు.