News December 14, 2024

రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు

image

TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. OMR పద్ధతిలో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 10-12.30, మధ్యాహ్నం 3- 5.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News November 11, 2025

కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.

News November 11, 2025

బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

image

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

image

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్‌మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయి.