News December 14, 2024
ఫుడ్ షేర్ చేసుకున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు వర్షం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా డగౌట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఇద్దరూ లంచ్ బ్రేక్‌లో ఫుడ్ షేర్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బాక్స్‌లోని ఫుడ్ తింటూ కనిపించారు. కాగా ఇవాళ మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడం అనుమానమే.
Similar News
News March 13, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సరఫరా యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆమె, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9154249727ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
News March 13, 2026
మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.
News March 13, 2026
మూసీ పునరుద్ధరణను గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా: రేవంత్

TG: చరిత్రలో నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయని CM రేవంత్ రెడ్డి అన్నారు. మనం కూడా అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా అని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. BRS, BJP దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో CM ఈ వ్యాఖ్యలు చేశారు.


