News December 14, 2024
మంచు విష్ణు సంచలన ప్రకటన ఇదేనా?

నటుడు మంచు విష్ణు ఈరోజు 12 గంటలకు <<14871804>>సంచలన ప్రకటన<<>> చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన ‘హర హర మహాదేవ్’ అంటూ ఓ వార్త లింక్‌ను షేర్ చేశారు. హాలీవుడ్ దిగ్గజం విల్ స్మిత్‌తో విష్ణు నేతృత్వంలోని తరంగ వెంచర్స్ టైఅప్ అవనుందని వార్త సారాంశం. త్వరలోనే దీనిపై గుడ్ న్యూస్ రావొచ్చని చెప్పుకొచ్చారు. దీనిద్వారా OTT ప్లాట్‌ఫారమ్స్, యానిమేషన్, గేమింగ్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


