News December 14, 2024

KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: పాడి కౌశిక్ రెడ్డి

image

TG: హీరో అల్లు అర్జున్‌ను నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నిన్ననే బెయిల్ పేపర్లు అందినా జైలు అధికారులు ఆయనను ఇవాళ రిలీజ్ చేయడం ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని అంటున్నారని, ఆయనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

Similar News

News February 15, 2026

కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని సోమవారం నిర్వహించలేమని చెప్పారు.

News February 15, 2026

BIG DAY: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

image

TG: ‘పుర’ పోరు చివరి అంకానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రేపు 11AMకు ప్రమాణం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డి.మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి చేయి ఎత్తే విధానంలో అధికారులు ఎన్నిక పూర్తిచేస్తారు. లేదంటే మరో రోజుకు వాయిదా వేస్తారు.

News February 15, 2026

మహిళల్లో గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

image

ప్రస్తుతకాలంలో పిల్లలు, ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్‌అటాక్ వస్తోంది. అయితే మహిళలకు దీని ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఛాతీలో అసౌకర్యం, భుజాలు, వీపు, మెడ, దవడ ప్రాంతాల్లో నొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తలతిరగడం, చెమట ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.