News December 14, 2024

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ

image

టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీచేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఇటీవల కాలంలో జనసేన నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా ఈ మేరకు టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు.

Similar News

News January 11, 2026

శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

image

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.

News January 11, 2026

సంతబొమ్మాళి: వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

image

సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ దిబ్బలమరువాడ గ్రామానికి చెందిన రామారావు(55) ఆదివారం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తోటి మత్స్యకారులతో సముద్రంలోకి వేటకెళ్లి ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని తోటి మత్స్యకారులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News January 11, 2026

శ్రీకాకుళం: ఎస్పీ కార్యాలయంలో ఓబన్నకు నివాళులు

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఆయన సేవలను నెమరువేసుకున్నారు.