News December 14, 2024
భీమిలి: అల్లు అర్జున్ నివాసంలో కలిసిన గురు శిష్యులు

అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భీమిలి ఎమ్మెల్యే గంటా, మాజీ ఎమ్మెల్యే అవంతి కలిశారు. గురు శిష్యులుగా ముద్ర వేసుకున్న వారు చిరు నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్నారు. ఇరువురి కలయికపై భీమిలిలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి తిరిగి టీడీపీలో చేరతారని చర్చ నడుస్తోంది.
Similar News
News February 24, 2026
కల్తీ పాలు తాగిన బాలుడు కేజీహెచ్‌లో మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ.. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారన్నారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.
News February 24, 2026
సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.
News February 24, 2026
విశాఖ పోలీసుల అదుపులో క్రిప్టో కరెన్సీలో కేసులో కీలక సూత్రధారి

క్రిప్టో కరెన్సీ పేరుతో విశాఖలో వందల కోట్లు వసూలు చేసిన కీలక సూత్రధారుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు సోమవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు PGRSలో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.రవి కిరణ్ తప్పు చేయలేదని సీఐ భవానీ ప్రసాద్ వాదిస్తుండగా.. బాధితులు మాత్రం మేము అతనికే సొమ్ము చెల్లించామని ఆధారాలు చూపిస్తున్నారు.


